జీవితాంతము వరకు
నీకే
జీవితాంతము వరకు నీకే – సేవ
సల్పుదునంటిని = నీవు నాతో నుండి ధైర్యము
నిచ్చి నడుపుము రక్షకా
1.
ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన = అన్ని
పోవును
నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా
2.
అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె = తిన్నగా నీ
మార్గమందున – పూనినడచెద రక్షకా
3.
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను =
శత్రువగు సాతాను గెల్వను చాలు నీకృప రక్షకా
4.
నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్న్ – చెదర
గొట్టుము రూపుమాపుము – శీఘ్రముగ నారక్షకా
5.
మహిమలో నీవుండు
చోటికి – మమ్ము జేర్చెదనంటివే = ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా
6.
పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక = ఎపుడు నిన్నే
వెంబడింపగ – కృప నోసంగుము రక్షకా
No comments:
Post a Comment