"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: April 2018

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Angurapu chetlu


అంజురపు చెట్లు పూయక పోయినను
అంజురపు చెట్లు పూయక పోయినను
ద్రాక్ష చెట్లు ఫలించక పోయినను
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను

1.    ఓలివ చెట్లు కాపు లేకపోయినను
చేనిలోని పైరు పంటకు రాకపోయినను
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను

2.    కన్నీళ్ళ ఎదురైనాకు వచ్చినను
పరిస్థితులే అపజయముగా ననుమార్చినను
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను

3.    బంధువులే నన్ను విడిచిపోయినను
ఊరంత నన్ను వెలివేసినను
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను

Aananda sandrabunaa


ఆనంద సంద్రంబునా – నీ జీవిత నావను
ఆనంద సంద్రంబునా – నీ జీవిత నావను
నడిపేది ఆ యేసుడే – దరిచేర్చి ఆ దేవుడే
1.                 పెనుగాలులే వీచినా – తుఫానులే తరిమినా
రక్షించి కాపాడి – ప్రభు అండ నీకుండ
దిగులేల ఓ సోదరా – నిశ్చింతగా సాగుమా
2.                 ఆపత్కాలమునందునా – రోదించి ప్రార్ధించినా
జవాబేమి లేదని – దూషింపబోకుమా
ప్రభు చిత్తమనే గిన్నెనే – సంతోషముగా త్రాగుమా
3.                 ఏవైపు నీ మార్గము – ఏవైపు నీ గమ్యమూ
ప్రభు సన్నిధిని వీడి – పయనింప చూచి
మత్స్యంబు గర్భంబునా – నివసింప గోరేదవా

Hallelujah ani paadi stuthimpanu


"Praise ye the LORD. Sing unto the LORD a new song, and his praise in the congregation of saints."

Psalm 149:1

హల్లెలూయ అని పాడి స్తుతింపను
హల్లెలూయ అని పాడి స్తుతింపను
రారే జనులారా – మనసార – ఊరూర
హల్లెలూయ అని పాడి స్తుతింపను
రారే జనులార ఊరూర నొరార

1.  పాడిపంటల నిచ్చు పాలించు దేవుడని
కూడు గుడ్డల నిచ్చు పోషించు దేవుడని
తోడూ నీడగా నిన్ను కాపాడే నాధుడని

పూజించి – పూజించి పాటించి – చాటింపరారే

2.  తాత ముత్తాతలకన్న ముందున్న దేవుడని
తల్లి తండ్రుల కన్న ప్రేమించు దేవుడని
కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని

3. రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని -
 నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని

4.బంధుమిత్రుల కన్న బలమైన దేవుడని
అన్నదమ్ములకన్న ప్రేమించి వచ్చెనని
నిన్న నేడు ఏకరీతిగా వున్నాడని 

Download Song Lyrics as PPT




SONG REQUEST

Name

Email *

Message *