"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: August 2018

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Pradhana vinedi | TELUGU CHRISTIAN SONGS




ప్రార్థన వినెడి పావనుడా
           ప్రార్థన వినెడి పావనుడా – ప్రార్థన మాకు నేర్పుమయా
1.               శ్రేష్టమైన భావము గూర్చి – శిష్య బృందముకు నేర్పితివి = పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్థన నేర్పుమయ్యా
2.               పరమ దేవుడవని తెలసి – కరమ లెత్తి జంటగ మోడ్చి = శిరమునువంచి – సరిగను వేడిన – సుంకరి ప్రార్థన నేర్పుమయా
3.               దినదినంబు చేసిన సేవ – దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు – దిటముగ కొండను – చేసిన ప్రార్థన నేర్పుమయా
4.               శత్రుమూక నిను చుట్టుకొని – సిలువపైని నిను జంపగను = శాంతముతో నీ – శత్రుల బ్రోవగ – సలిపిన ప్రార్థన నేర్పుమయా

Download Lyrics as PPT

Shuddhuda Ghanuda | TELUGU CHRISTIAN SONGS





"It is God that girdeth me with strength, and maketh my way perfect."

Psalm 18:32

శుద్ధుడా ఘనుడా రక్షకుడా
శుద్ధుడా ఘనుడా రక్షకుడా
నా కాపరి నీవే నా దేవుడా

శక్తి లేని నాకు
బలమిచ్చు వాడా
నా స్నేహితుడా
బలవంతుడా

హర్షింతును
నిన్నారాధింతును
స్తుతియింతును
నే కీర్తింతును

శక్తి లేని నాకు
బలమిచ్చు వాడా
నా స్నేహితుడా
బలవంతుడా

రక్షణ ఆధారం నీవే
విమోచన
నీవే యేసయ్య
నా స్నేహితుడా
బలవంతుడా

Bharatha deshama yesuke | TELUGU CHRISTIAN SONGS




భారత దేశమా ..యేసుకే
భారత దేశమా ..యేసుకే..
నా భారత దేశమా..ప్రియ యేసుకే..(3)
నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధనా ..
నిను సొంతం చేయాలన్నదే నా ద్యేయం ..(2)
ఏసునామమే జయముజయమని
ఇహమంత మారు మ్రోగాలి..
పనిచేయుచున్న సాతాను శక్తులు
పటాపంచలై పోవాలి ..

భారత దేశమా నా భారత దేశమా..
నాప్రియయేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా..
ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి ...

1.               సృష్టి కర్తనే మరచి భారత దేశమా..సృష్టిని పూజించుట తగునా నా భారత దేశమా(2)
ఈ లోకమును సృష్టించిన ఏసే భారత దేశమా
నిను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారత దేశమా(2)
2.               శాంతికి అధిపతి ఆ ఏసే భారత దేశమా ..
శాంతి రాజ్యమును స్థాపించును
నా భారత దేశమా (2)
లోకమంతయు లయమైపోవును
భారత దేశామా ..
లోకాశలన్నియు గతించి పోవును
భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా నా ప్రియయేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా ..ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి (3)

రాజుల రాజుగా మన ఏసే భారత దేశమా ... పెండ్లి కుమారుడై రానుండే నా భారత దేశమా (2)
3.               యేసుని నమ్మిన దేశములన్నీ
భారత దేశామా..
యేసుతో కూడా కొనుపోబడునా భారత దేశమా(2)
భారత దేశమా యేసుని చేరుమా..సువర్ణ దేశముగా మార్చబడుదువు భారత దేశమా(2)

Download Lyrics as PPT



Mana desam Kananu desam | TELUGU CHRISTIAN SONGS



మన దేశం భారత దేశం
మన దేశం భారత దేశం
మన రాజ్యం దేవుని రాజ్యం

స్తుతి ఆరాధన నా ఊపిరి
ప్రేమనురాగము నా జీవితం

మన దేశం కనాను దేశం
మన రాజ్యం దేవుని రాజ్యం

స్తుతి ఆరాధన నా ఊపిరి
ప్రేమనురాగము నా జీవితం

Download Lyrics as PPT


Eeyana yesu rakshakudu | TELUGU CHRISTIAN SONGS





ఈయనా యేసు రక్షకుడు – తన – దాయమని రక్షింప
ఈయనా యేసు రక్షకుడు – తన – దాయమని రక్షింప – దలచెనా నన్ను – నీయనా యేసు రక్షకుడు = ఆయాసమగు నొక్క మోపు – నే – మోయలేకుండ నా – మూపుపై నుండ – శ్రేయ: కరపు సిలువ జూపి – నాకు హాయి నిచ్చెను భార – మంత వెడలించి
1.               దురితాత్ముడని త్రోయకుండ నన్ను – బరిశుద్ధుడా యేసు – ప్రభుడు కరుణింప = ధరణిలో నిది మహాద్భుతము – నే – మరుతునా యీ ప్రేమ – మరణమౌ దాక
2.               ఓపగూడని దుష్కృతంబుల్ – నేను – తేపతేపకుజేసి – ద్వేషినై యుండ = గోప మింతైన రానీక – నన్ను – గాపురుషుడని తానూ – ఖండింపడాయె
3.               మనస్తమో గుణము లెడబాపెన్ – నా – దినకరోదయ మట్లు – దీప్తిమది మించెన్ = తన పాదములు జాడ లబ్బెన్ – సదా – వినుతి కెక్కిన వాని విమలాత్మ వెలుగు
4.               హతు డయ్యె నాయేసు నాకై – దు – ర్గతి తొలగి నాకు మో – క్షమే గల్గు కొఱకు = అతి దయాదీర్ఘశాంతుండే – దైవ – సుతుడని యెఱిగితి – శోధింపగాను
5.               దీవింపదగు నతని సిలువ – నా – జీవాంతమగు దనుక – చెలగి మోయుచును = ఈ వసుంధర జనుల కెల్ల మీరు – సేవించు డేసునని – చెప్పి చాటుదును

SONG REQUEST

Name

Email *

Message *