ధ్యానింప నే చిత్తమా
ధ్యానింప నే చిత్తమా – వర్షాంతమున – ధ్యానింపనే చిత్తమా = ధ్యానింప వాసక్తి – జ్ఞానంబు గలిగించు – జ్ఞాన స్వరూపుడు – జ్ఞానాత్మచే నీకు
1. అరయ నీ తలపుల – నఘము లగుపడు నీకు – పరిశుద్ధు డీక్షింప బహుగా గనుపడుచుండు
2. పరికింప బలుకుల – పాప మగుపడు నీకు – పరిశుద్దు డరయు గ – న్పడకుండు నే యది
3. క్రియలను జింతింప – మయిల గనపడు గాన – భయ మొంది నమ్మికను – బదవే క్రీస్తుని దరికి
4. దేవుని ఘన ప్రేమ – దినదినము దలపోయి – నీవు పొందగ వచ్చు నిక్కమైన శుద్ధి
5. స్మరియింప నీలోన – వర రక్షకుని పాట్లు – భరియింప నోపుదువె – పాప మొక నిమిషంబు
6. హృదయంబు విమలాత్మ – సదనంబు గావింప – పదవే శ్రీఘ్రంబుగ – పరమ జనకుని కడకు
7. దేవుని సేవింప – దిరముగ నాశించి – దేవాత్మ కొర కీవు – దినము దేవుని వేడ
No comments:
Post a Comment