నీ జననం లోకమంతా పరవశం కొత్తధనం
నీ జననం లోకమంతా పరవశం కొత్తధనం
పులకించే నీదు రాకతో మా హృదయం ఈ దినం (2)
దివిలో భువిలో ఆనందం, వెళ్లి విరిసే శుభదినం (2)
ఈ లోకానికే నీవోకవరం (2)
దైవ దూత దర్శనముతో, పరిశుధాత్మ వెలుగు నీది
దైవ చిత్తం అనుసరించి, శిరమును వంచి కన్య మరియ
దైవ తనయుడు పుట్టగానే, ఆకాశాన తార వేలేసే (2)
ధన్యమాయే ఈ జగతి
తూర్పున తారను చూసి ఘనులు, పయనము కట్టిరి బెత్లెహేముకు
ఆ పశు సాలలో బాలుని చూసి, యూదుల రాజు ఇతడే అనిరి
బంగారు సాంబ్రాణి భోలములను , ఆ చిన్ని రాజుకు సమర్పించిరి (2)
లోక రక్షకుడు ఇతడే అనిరి
No comments:
Post a Comment