"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: April 2017

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Yehova gadde mundaata

యెహోవా గద్దె ముందట

1. యెహోవా గద్దె ముందట
జనంబులార మ్రొక్కుడి
యెహోవా దేవుడే సుమీ
సృజింప జంప గర్తయే

2. స్వశక్తిచేత నాయనే
మమున్ సృజించె మట్టిచే
భ్రమించు గొఱ్ఱె రీతిగా
దప్పంగ మళ్లీ చేర్చెను

3. సుకీర్తి పాడి గుంపులై
ప్రసిద్ధిచేత మాయనన్
జగత్తు వేయ్యి నోళ్ళతో
స్తుతించు దివ్యమౌ ధ్వనిన్

4. ప్రభుత్వ ముండు  నంతకున్
అగున్ నీ ప్రేమ నిత్యము
చిరంబు నీదు సత్యము
వసించు నెల్లకాలము

Download Lyrics as PPT

Prabhalamugane prasthutincheda

ప్రబలముగనే – ప్రస్తుతించెద – ప్రభుని కృపలన్ని

ప్రబలముగనే – ప్రస్తుతించెద – ప్రభుని కృపలన్ని = ప్రతి దినము నిను – ప్రచురపరచెద – ప్రభుడ నావిభుడా

1.               పొందుగోరి నా – యందు నిలచిన – బంధుమిత్రుడవు = మందమతి కా – నందమొసగిన – మహిమతేజుడవు
2.               చింతదీర్చి నా - భ్రాంతి మార్చితి – వెంత వింతదియో = స్వాంతమునకడు – శాంతిగూర్చితి  - వెంత కరునదియో
3.               నీతి కరపిని – జాతి మరపిన – ఖ్యాతి యేసునిదే = నీరసుడ నను – గారవించిన నీతిరాజితడే
4.               జీవమిచ్చిన – జావవచ్చిన – దేవసుత నీవే = జీవదాయక – బ్రోవరాయిక – జాలమేలనురా

5.               నిమిషనిమిషము – నిను భజించెద – నెమ్మనంబునను = శమదమాది – సుగుణశోభిత – సమ్మదిని నిమ్మా




Jayaprabhu yesunea vambadinchuchu

జయప్రభు యేసునె వెంబడించుచు
జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము – యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని – పయనము జేసెద మా ప్రభు వెంబడి
1.               ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును – అవనిలో రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమే – అనిశము మనకిల మార్గము చూపగ
2.               ధర విరోధులు మమ్ము జుట్టగ – దరి జేరెద మేసున్ – ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డుంబములన్నిటి – మైత్రిని వీడి నడచెద మేసుతో
3.               మా ప్రభు జూముము నీదు మార్గపు – మాదిరి జాడలను – నీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ – మా కిడు బలమును యీ క్రుపాదినమున
4.               మా కొరకై నీవు నడచిన – మార్గము జూడగను – మేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలు – మరువక విడువక నడువగ కృపనిడు
5.               ఇహపరముల నినుగాక ప్రేమతో – ఎవరిని గొలిచెదము ? – ఎవరిని ప్రేమింప వశమె ? = విహరించెదము యేసుని వెంబడి – మహిమ రాజ్యమున యేసుని గొలువగ

Hey Prabhu Yesu

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా పాపహరా శాంతికరా       ||హే ప్రభు||
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ         ||సిల్వధరా||

తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా        ||సిల్వధరా||

మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా       ||సిల్వధరా||

పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా       ||సిల్వధరా||

కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా        ||సిల్వ ధరా||

దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా        ||సిల్వ ధరా||

పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా        ||సిల్వ ధరా||

ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా        ||సిల్వ ధరా||

కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా           ||సిల్వ ధరా||


Deva daasapaalaka raaja raave

దేవ దాసపాలక రాజా రావే
దేవ దాసపాలక రాజా రావే - జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా – దేవా దేవా  దీన పోషకా
1.   లోకబాధ యిరుకు శోధన నుండి – స్వికరించినావు త్ర్యేకదేవుడా స్తోత్రం స్తోత్ర మర్పణ
2.   దిక్కులేని పాపికోరకు నీ దేహం – మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కాటా – జయం జయం జయము నొందగా
3.   కఠిను లంత కుటిలముజేసి నిన్ను – గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య  నెత్తిరా – యిదే నా యెడ బ్రేమ జూపితి
4.   ఇంత యోర్పు యింత శాంతమా నాకై – పంతముతో బాపికోరకు బ్రాణమియ్యగా – పాపిన్ నీదగు దాపు జేర్చవే


5.   కలువరి గిరి వరంబున నాకై – తులువను నా కొరకు నిలను సిల్వమోయగా – హలెలూయా హలెలూయ ఆమేన్ 

Siyonu kanya

సియోనుకన్యా  - సంభ్రమపడు
సియోనుకన్యా  - సంభ్రమపడు – వేయుము కేకల్ = పాయక నీ రాజు – భారవాహక మెక్కి – బాలస్తోత్రములతో – బైలుదేరి వచ్చె
1.               హేబ్రాయిలోను – నీ రాజు పేరు – యూదులరాజు = హేబ్రియ జనులను – అబ్రాము కొడుకులను – విభవదేశము జేర్చు – శుభరాజు యీతండే
2.               హెల్లేనీలోను – నీ రాజు పేరు – యూదులరాజే = యెల్లపాపుల బ్రోచు – తాల్మిరక్షకుడితడు – చల్లని ప్రభువని – గొల్గొత మ్రోగెను
3.               ఉర్వి రోమాలో – నీ రాజు పేరు – యూదులరాజే = సర్వరాష్టికులకు – బూర్వపితరులతోను – వరసింహాసన మిచ్చు – వరదేశాధిపు డితడు
4.               వాసిగ హెబ్రీ – హెల్లేనీలో రోమాయిలోను = హోసన్నా హోసన్నా – ప్రభుని  పేరట వచ్చు – మేస్సియ్యదావీదు – కొడుకా శ్రీశుభములు

Jeevaahaaramu rammu

జీవాహారము రమ్ము – చిరజీవాన్నము నిచ్చి

జీవాహారము రమ్ము – చిరజీవాన్నము నిచ్చి – జీవిత క్షుద దీర్చుము = జీవనపధములో – చీకటి పడువేళ – జిర్ణించు కొనిపోవు – జీవితాశల బెంచ
1.            విందుగృహమునకేగి – వీక్షింతు భ్రమతో నీ – వివిధసుభోజ్యంబులన్ = విచ్ఛిన్నమైన నీ – విమల దేహపు విందు – వికలంబౌ మనసుతో – వినుతించి, తినుచుందు
2.            రుధిర ధారలలోన – ఋజువౌ నీ ప్రేమలు – రూపుమాయును పాపము = ఋతద్రాక్ష వల్లీ నీ – రుధిరపానముచేత – ఋణభారము దీరి – రుచి యించి నా బ్రతుకు
3.            భవదీయ స్మరణార్ధం – పతితుల శరణార్థం – ఫలియించు యీహోమము = ప్రభువా నాయాత్మలో – ప్రతిబింబమై వెలసి – పానార్పణంబౌను – ప్రతిరక్త బిందువు

4.            ఆత్మాంతఃపురములో – ఆంతర్య గదిలోన – ఆరాధింతు నీ నామము = అలనాటి నీ రక్త – నవనిబంధన నేడు – అపురూపమై నాలో – నవతరించును దేవా

Ninne preminthunu yesu


I will praise you, Lord my God, with all my heart; I will glorify your name forever.


Psalms 86:12



నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా

నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా

నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా

నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా


SONG REQUEST

Name

Email *

Message *