"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: March 2018

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Idigo nee raaju vachhuchunde

ఇదిగో నీ రాజు వచ్చుచుండె – సియోనుకుమారి
ఇదిగో నీ రాజు వచ్చుచుండె – సియోనుకుమారి
సంతోషించు – యెరుషలేం కుమారి ఉల్లసించు
1.    నీదురాజు నీతితో దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు – వచ్చు చుండె
2.    రక్షణగల వాడుగ  - అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యేరుషలేం – వచ్చు చుండె
3.    సాత్వికుండు యీభువిన్ – అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై వచ్చుచుండె
4.    దీనపరుడు నీ ప్రభు – ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై – వచ్చుచుండె
5.    ఇలను గాడిదనెక్కియే – బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు – వచ్చుచుండె
6.    దావీదు కుమారుడు – దేవుడు పాపులకు
జయగీతములతో – వచ్చుచుండె
7.    యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము
యేసుడిల వచ్చుచుండె – హల్లెలూయ

Yesuva Jayamutho

యేసువ జయముతో – యేరుషలేమున
యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా = వాసిగ బొగడగ – వసుధను జనులు – విజయము జేసిన యో ప్రభువా
1.    మట్టలు బట్టియు – బట్టలు బరచియు – గట్టిగ బాడగ యో ప్రభువా = అట్టహాసముతో – అశ్వము నెక్కడ – అణకువ గార్దభ మెక్కిన ప్రభువా
2.    పిల్లలు పెద్దలు – పలుకేకలతో – బలికి నుతించగ యో ప్రభువా = చల్లగ వానిని – సరియని యొప్పి – సంతోషించిన యో ప్రభువా
3.    కొందరు వారిని – తొందర జేయగ – కూర్మిని దిద్దిన యో ప్రభువా = అందరు మానిన – అరచును రాళ్లని – అతని నిచ్చిన యో ప్రభువా
4.    యేరుషలేం కొరకై – యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా = యేరుషలేమందున – యాలయ మంతను – శుభ్రపరచి యో ప్రభువా
5.    మా కొఱకై తన – ప్రాణము బెట్టిన – మాన్యుడవీవె యో ప్రభువా = మా
కొరకై ధర – మరణము గెల్చిన – మహిమ స్వరూపుడ యో ప్రభువా
6.    మాదు మనస్సుతో – హృదయము నాత్మను – నీదిగ గైకొని మో ప్రభువా = సాదర వాక్కులు – చక్కగ బలికియు – నాదరించుమము నో ప్రభువా

Yehova naa kaapari naaku lemi kalugadu



 "The LORD is my shepherd, I shall not be in want. he restores my soul. He guides me in paths of righteousness for his name's sake. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me; your rod and your staff, they comfort me."
Psalm 23 1

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు
1.                           పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండచేయుచున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు
స్తుతించెదా స్తుతించెదా స్తుతించెదా స్తుతించెదా
2.                           నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు
3.                           గాడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను
నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును
4.                           నా శత్రువుల యెదుట భోజనము నాకు సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నెనిండి పోర్లుచున్నది

Yehova naaku velugaye


"I gain understanding from Your precepts; therefore I hate every false way. Your word is a lamp to my feet and a light to my path."

Psalm 119:104-105


యెహోవా నాకు వెలుగయ్యె
యెహోవా నాకు వెలుగయ్యె
యెహోవా నాకు రక్షణయ్యె
నా ప్రాణ దుర్గమయ్యే – నేను ఎవరికి ఎన్నడు భయపడను


1.  నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచిననూ
ఆపత్కాలమున చేయివిడువకను
యెహోవా నన్ను చేరదీయును

2.  నా కొండయు నా కోటయు నా ఆశ్రయము  నీవే
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను

3.  నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో  జీవించుటకు కృపతో నింపి కాపాడుము

Download Lyrics as PPT



SONG REQUEST

Name

Email *

Message *