"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: July 2018

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Naa jeevitha kaalamantha | TELUGU CHRISTIAN SONGS


The LORD is my rock, my fortress and my deliverer; my God is my rock, in whom I take refuge, my shield and the horn of my salvation, my stronghold

Psalms 18:2


నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా
నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా
యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును
నా దేహమే యాగముగా అర్పించిన చాలునా 
||నా జీవిత||
నా బాల్యమంతా నా తోడుగ నిలిచి

ప్రతి కీడు నుండి తప్పించినావు
యవ్వనకాలమున నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే కొనసాగినావు
ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో
నను దైర్యపరిచి నను ఆదుకున్నావు
యేసు నీవే నీవే యేసునీవే నా సర్వస్వమూ 
||నా జీవిత||

కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే

సంతోష ఉదయాలు నాకిచ్చినావు
హృదయాశలన్ని నెరవేర్చినావు
యోగ్యుడను కాకున్న హెచ్చించినావు
ఎంతో ప్రేమ మితిలేని కృపను
నాపై చూపించి నను హత్తుకున్నావు
యేసు నీవే నీవే యేసునీవే నా ఆనందమూ 
||నా జీవిత||

Download Lyrics as PPT





Jeevithamlo neela undalani



Your righteousness reaches to the heavens, O God, You who have done great things. Who, O God, is like You?

                                         Psalms 71:19

జీవితంలో నీలా ఉండాలని
జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశున్నది
తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత

పరిశుద్ధతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో
నీలాగే చేయాలని నీతోనే నడవాలని
నీలాగే చేసి నీతోనే నడిచి నీదరికి చేరాలని  ఓ ఓ ఓ ...

కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లడుటలో ప్రేమించుటలో
నీలగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని

నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని

Download Lyrics as PPT

                              

Jeevithamlo Neela Undaalani
Jeevitamlo neela undaalani
Yesu naalo entho aashunnadhi
Tearuna naa korika
cheriti prabhu paadala chenta

Parishuddhatalo praadinchutalo upavaasamulo upadeshamulo
Nilagae cheyalani neethone nadavaalani
Nilagae chesi nithone nadichi niidhariki cheraalani

Kurchundutalo  niluchundutalo
Maatlaadutalo preminchutalo
Nilage bratakaalani ni chittam neraverchani
Nilagae bratiki nii chittam neraverchi  ni dariki cheralani

Priya yesu nirminchitivi




ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం
ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం
ముదమార వసియించునా – హృదయాంతరంగమున
1.               నీ రక్త ప్రభావమున – నా రోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రి – ప్రతి పాపమును కడిగి
2.               అజాగరూకుడనైతి – నిజశ్రాయమును విడిచి
కరుణారసముతో నాకై – కనిపెట్టితివి తండ్రీ
3.               వికసించె విశ్వాసంబు – వాక్యంబును చదువగనే
చేరితి నీదుదారి – కోరి నడిపించుము
4.               ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకమునిమ్ము – ఆత్మీయ రూపుండా

Gadandakaaramulo ne nadichina velalo

"Surely He will deliver you from the snare of the fowler, and from the deadly plague.He will cover you with his feathers, and under his wings you will find refuge; his faithfulness will be your shield and rampart."

Psalms 91:3-4

గాఢాంధకారములో నే నడచిన వేళలో
గాఢాంధకారములో నే నడచిన వేళలో (2)
కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును (2)
ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్
జడియను బెదరను నా యేసు నాకుండగా (2)

అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగా (2)
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును (2)
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును
జడియను బెదరను నా యేసు నాకుండగా (2)

Download Lyrics as PPT

Aatma nadupu



"Guide me in your truth and teach me, for you are God my Savior, and my hope is in you all day long."
 


              Psalm 25:5



ఆత్మా నడుపు సత్యము లోని కిపుడే

ఆత్మా నడుపు సత్యము లోని కిపుడే – యాత్మా నడుపు = ఆత్మా నీ
సాయంబు – నధికంబుగా నిచ్చి – ఆత్మానందముతో దైవారాధనమున

1.               ఘోర కలుషంబుల – దూరంబుగా దోలి = పారమార్థిక బుద్ధి గోరు నట్టులను

2.               అంధత్వంబు వలన – మందమైయుండు మా = డెందంబు లెల్ల నీ యందు వెలుగుటకు

3.               నిర్మల హృదయంబు – నిరతంబు మా కిచ్చి = కూర్మిన్ నీ వరముల – గూర్చి దీవించి

4.               సకల మానవులతో – అకలంక శుభవార్త = బ్రకటించు బలజ్ఞాన – నికరంబు నిచ్చి

5.               దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మోసంగి – ప్రభు సేవలోన





Neethone Undutaye


 
"I have been crucified with Christ, and I no longer live, but Christ lives in me. The life I live in the body, I live by faith in the Son of God, who loved me and gave Himself up for me."

Galatians 2:20




నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా
నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా
నీ చిత్తం నేరవేర్చుటయే
నా హృదయ తపనయ్యా


" యేసయ్యా నిన్నే కదా
నా ముందు నిలిపెను " (2)

కరుణయు కృపయు నిరంతరం శాంతి
అన్నియు చేయువాడా (2)
నా జీవితం నశింపక (2)
కాపాడువాడా నా కాపరి


నా కొరకు అన్నియు చేయువాడా
చేసి ముగించువాడా (2)
నా బరువు నా  బాధ్యత (2)
నీ పాద చెంత నుంచితిని

Neethonea undutayea

Neethonea undutayea naa jeetha vanchayaa 

Nee chittham neraverchutaye
Naa hrudaya tapanayyaa


" Yesaiah nenne kada 

Naa mundu nilipenu (2)



Karunayu krupayu nirantaram shanti
anniyu cheyuvaada (2)

Naa jevitam nashiyimpaka (2)

Kaapaaduvadaa naa kaapari 

Naa koraku anniyu cheyuvaadaa Chesi muginchuvaada (2)

Naa baruvu naa badyata (2)

Nee paada chenta nunchitini



Adagaka mundae akkaralerigae

అడగక ముందే అక్కరలెరిగి

అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా


పదే పదే నేను పాడుకోనా
ప్రతి చోట నీ మాట నా పాటగా
మరి మరి నే చాటుకోనా
మనసంతా పులకించని సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే
చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2)||పదే పదే||

మమతల మహా రాజా
(నా) యేసు రాజా (4)

అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)

అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)  ||మమతల||

అడిగిన వేళ అక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నా దరి చేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)  ||పదే పదే||


Yea samayamandaina




ఏ సమయమందైనా ఏ స్తలమందైనా
ఏ సమయమందైనా ఏ స్తలమందైనా
ఏ స్థితిలో నేనున్నాస్తుతి పాడేదన్
ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రిస్తుకే ఆరాధనా
గొర్రెపిల్ల క్రిస్తుకే ఆరాధనా

చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా
కరువు ఖడ్గము హింస ఎదైననూ
మరణ శాసనమే పొంచున్ననూ

యేసు నామమే ఆధారము కాదా
యేసు రక్తమే నా విజయము
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో
కునుకక కాపాడు యేసు దేవునికే

ఏ సమయమందైనా ఏ స్తలమందైనా
ఏ స్థితిలో నేనున్నాస్తుతి పాడేదన్
ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రిస్తుకే ఆరాధనా
గొర్రెపిల్ల క్రిస్తుకే ఆరాధనా

నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రిస్తుడే
తన చేతులతో  నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్

యెహోవా రాఫా నను స్వస్థ పరిచెను
యెహోవా షమ్మా నాకు తోడుగా
యెహోవా నిస్సీ నా ధ్వజముగా
ఆల్ఫా ఒమేగా ఆది దేవునికే



Maa uhalu puttakamunupae


మా ఊహలు పుట్టక మునుపే
మా ఊహలు పుట్టక మునుపే మా సర్వమునెరిగిన దేవా (2)
ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)
విశ్వాస నిరీక్షణతో కనిపెట్టియున్నచో (2)
పొందెదము ఎన్నో మేలులూ ప్రభువా నీ పాద సన్నిధిలో (2)

నిన్నడుగకుండగనే మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)
పలు సమయముల యందు పలు వరముల నిచ్చితివి (2)
అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు        

ప్రార్ధించుచుంటిమి సమస్యలు తీర్చమని
నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని (2)
ఊహించు వాటికంటె అధికముగా నిచ్చెడి దేవా (2)
ఇంతకంటె మాకేమి వలదు నీ తోడు నీడే చాలు


SONG REQUEST

Name

Email *

Message *