"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: January 2017

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Deevaa divyaananta prabhava

దేవా దివ్యానంత ప్రభావ
దేవా దివ్యానంత ప్రభావ – మాంపాహి ఘన యెహోవా = స్థావర జంగమ – సహిత నిఖిల జగ – దావన పావన – భావ నిరంతర
1.   సార – కారుణ్యపారా – వారా – సర్వజ్ఞ నిర్వి – కారా – యేసు నామావ – తారా – దీన జనోప – కారా = ఘోరమైన సం – సారటవి బడి – దారి గనని నను – జేరబిలిచితివి
2.   అక్షీ – ణ  విభవానంద – మోక్ష – రాజ్య మహిమా – ధ్యక్ష – సంతత సుజన రక్షా – కపట దుర్మనుజ – శిక్షా = పక్ష విపక్ష వి – లక్షణ రహిత క – టాక్షము నాదెస – దీక్షను  నిలుపవె
3.   సుంద – రాశ్చర్య గుణ – బృందా – బంధుర నిత్యా – నందా – సాధు సజ్జన వంద్యా – ఖండిత కలుష బృందా = మంద మతిని నా – డెందము కడు  దెలి – వొంద జేసి నీ – యందు నిలుప గదె
4.   నీవు – నన్ను సృష్టించి – నావు – నా గురురాదేవుడవు  - క్రీస్తు యేసుని – చావు – వలన నన్మనిపి – నావు = పావన జనక సు – తాత్మలతోడను గేవల మొక్కడ – వై వెలిగెడి ప్రభు

5.   ప్రేమ స్వరూప నిత్య – క్షేమ – పతతి పావన – నామ - దాస లోకాబ్ధి – సోమ సర్వేశ పరమ – ధామ = నేమ మెఱుంగని – నీచుడ నధముడ – నోమహాత్మ దయ – తో మన్నింపవె 


Yesu nayakuda yella velalanu

యేసు నాయకుడ - యెల్ల వేళలను

యేసు నాయకుడ - యెల్ల వేళలను నీ – దాసుల నేలుమయ్యా  = మోసము లన్నిటి – మునగద్రోతునని – బాసుల జేసిన – ప్రభుడవు నీవెగా
1.              రేయింబవలు మా – న్యాయము చెరిపెడి – మాయ పిశాచిని = త్రోయుమి దూరము – బాయక భక్తుల – చేయి విడువని బహుశ్రేష్టుడ నీవెగా
2.              హృదయము లోకము  - మది పాపము మమ్ము – సతతము శ్రమ పెట్టును = సదయుడ మమ్మును – వదలక నిత్యము – మది తలపులలో – మహిమగ నేలుమీ
3.              కాపాడుమి మమ్ము – మాపు రేపు నీ – శ్రీ పాదము లోద్దను = ఏ పాపములను ఎలకుండగ నీ – ప్రాపునబెంచుము – మాపాలకుడవో
4.              మా కొరకై నీ – మేనును మ్రానున – మేకులతో గోట్టగ – మానము మహిమలు – మనుజుల కియ్యను – భానుడ రాజుగ – బ్రతికిలేచితివి

5.              చెఱను చెఱనుగా – మరి పట్టుక నీవు – పరమున కరిగితివే – వరముల నిడితివి – ధరలో నరులకు – పరముడ నీ దయ మరువశక్యమా 

Gaanamu cheyudu sukeerthananu

గానము జేయుడు సుకీర్తనను


గానము జేయుడు సుకీర్తనను = యెహో – వాను గూరిచి క్రొత్త – గాను రక్తిగను
1.               తన్నామము నుతించి యతని – రక్ష – జెన్నుగ సారె బ్ర – సిద్ధము జేసి = పన్నుగ నన్యులలో దన్యహిమ – యం – దున్నత చిత్రము – లను జాటండి

2.               ఘనతయు మహత్యమును – ద – ద్ఘనని యెదుటనుండు – ఘనబలమును = వినతమౌ సౌందర్యమును – న – తనని నిర్మల స్థల – మున విలసిల్లు

3.               పరిశుద్ధాలంకారముతో – నా – పరమాత్మారాధన – పరులై యుండుడి = ధరణి సకల జనులారా – లోక – గురుని యెదుట భీతి – గొనుచు నుండండి

4.               పరిపాలించుచున్నాడనుచు తోడి – నరులతో జెప్పుడి – ద్గుర గదకుండ – స్థిరముగ జేయు సత్యముగా – జనుల – కరిమురిగాను న్యా – యము విమర్శించు

5.               ఏమనిన నా మహాత్ముండు – వచ్చు – నీ మహికి న్యాయము – నేర్పరచుటకు = భూమి జనులకు నీతి సత్య – ముల – తో మించు న్యాయ మెం -  తో విమర్శించు

6.               జనులారా యా యెహోవాకు – మహి – మను బలమును సమర్పణము జేయండి వినయముతో గానుకలను – తీసి – కొని తత్ప్రాకారమందున వసియింపండి

anni kalambula


న్ని కాలంబుల
న్ని కాలంబుల-నున్న యోహోవా ని- న్నెన్నరంబయో కన్న తండ్రి
వన్నె
కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు - లున్న మై యుం
 మున్నె నీకు

1.   నిన్ను బ్రకటన సేయ - నిఖిల లోకములను - బన్నుగ జేసిన బలువీవె = ఉన్న లోకంబుల నుడుగక కరుణాసం- పన్నతతో నేలు ప్రభువీవె అన్ని జీవుల నెఱిగి  - యాహార మిచ్చుచు – నున్న సర్వజ్ఞ్యం – డవు నీవే = ఎన్న శక్యము గాఉన్న లక్షణముల సన్నుతించుకు నే- చాలుదునా
2.   ఫుట్టింప నీవంచు- పోషింప నీవంచు-గిట్టింప నీవంచు కీర్తింతును = వట్టి పనికి మాలి నట్టి మానవుల చే ట్టి రక్షింప బా-ధ్యుం వంచు = దట్టమైన కృపను -  దరి జేర్చ నాకిచ్చి ట్టయి నిలచియుండు ప్రభు వంచు = గట్టిడచే గద-ముట్టుదనుక నా ట్టుకొలది నిన్ను బ్రస్తుతింతు

3.   కారుణ్యనిధి వీవు కఠినాత్ముడను నేను - భూరి శుద్ధుడ వీవు-పాపి నేను సార భాగ్యువీవు-జగతిలో నాకన్న- దారిద్రుడే లేడు - రచి చూ = సార సధ్గుముల సంపన్నువు నీవు ఘోర దుర్గు సం-చారి నేను = ఏ రీతి స్తుతియింతు నే రీతి  సేవింతు  - నేర మెన్నక ప్రోవ- నెర నమ్మితి




SONG REQUEST

Name

Email *

Message *