చింత లేదిక యేసు పుట్టెను
చింత లేదిక యేసు పుట్టెను – వింతగను బేత్లెహేమందున = చెంత జేరను రండి సర్వజనాంగమా – సంతస మొందుమా
1. దూత తెల్పెను గొల్లలకు శుభ – వార్త నా దివసంబు వింతగా – ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి – స్తుతి లొనరించిరి
2. చుక్క గనుగొని జ్ఞాను లెంతో – మక్కువతో నా ప్రభుని గను గొన = చక్కగా బెత్లెముపురమున జొచ్చిరి – కానుక లిచ్చిరి
3. కన్యగర్భమునందు బుట్టెను – కరుణగల రక్షకుడు క్రిస్తుడు = ధన్యులగుటకు రండి వేగమె దీనులై - సర్వమాన్యులై
4. పాప మెల్లను పరిహరింపను – పరమ రక్షకుడవతరించెను = దాపు జేరిన వారి కిడు గడు భాగ్యము – మోక్షభాగ్యము